సర్వీస్-వారియర్ పని షేర్ చేసుకునే ప్లాటుఫారం ఇది మీలో చాలామందికి తెలిసిన విషయమే కానీ కొందరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలి అన్న ఆలోచనతో చెపుతున్నాను. ప్రతి టెక్నీషియన్ కూడా తన కుటుంబము కోసము మనీ సంపాదించుకోవడానికి అందరి మాదిరిగానే కష్టపడి పనిచేసి తన కస్టమర్ ను సంతృప్తి పరుస్తాడు. కొంతమంది స్వయంగా పని సంపాదించుకోగలరు. చాలామంది ఎక్కడో ఒకదగ్గర జాబ్ చేసుకుంటారు. ఇది అందరికీ తెలిసినదే. టెక్నీషియన్ లు అనే మాట ఇక్కడ పెద్ద కంపెనీలలో పనిచేసే వారి గురించి కాదు.ఇది ముఖ్యముగా వాటర్ ప్యూరిఫైర్,ఎయిర్ కండిషనర్,వాషింగ్ మెషిన్,మరియు ప్లంబింగ్ రంగాలలో ని వారికి మాత్రమే. వాటర్ ప్యూయర్లు ఆన్లైన్లో అమ్మేవి తప్ప సాధారణముగా టెక్నీషియన్లు లేదా, షాప్ లలో,ఎక్కువగా అమ్ముతుంటారు. కారణాలు ఏవైనా వారు రిపేర్ లేదా సర్వీస్ పనిని వేరే వాళ్ళ తో పంచుకోడానికి అంతగా ఇష్టపడరు. దీనివలన తప్పు ఏమి లేదు కానీ పని చెయ్యగలిగిన పరిధి తగ్గుతుంది కదా. సాధారణముగా ఒక టెక్నీషియన్ కానీ, స్వయముగా వర్క్ చేసుకునే ఓనర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి పని చెయ్యగలిగే అధిక దూరము 10 km. వరకూ ఉండవచ్చును. ...